ap farmers : If it rains for a few more days, the crop loss will be huge: Farmers' agony || మరికొన్న రోజులు వర్షం కురిస్తే పంట నష్టం అధిక : రైతుల ఆవేదన
ap farmers : If it rains for a few more days, the crop loss will be huge: Farmers' agony || మరికొన్న రోజులు వర్షం కురిస్తే పంట నష్టం అధిక : రైతుల ఆవేదన
పంట సాగులో రైతులకు(Farmers) ఎన్నో కష్టాలు పది పెట్టిన పెట్టుబడికి ఓ దఫా గిట్టుబాటు ధరవుండదు, గిట్టుబాటు ధర వున్నప్పుడు అకాల వర్షాలు, తెగుళ్ళ బెడదతో దిగుబడి రాదు. ఈ కష్టాలన్నీ లేకుండా పెట్టిన పెట్టుబడికి తగిన రాబడి వచ్చింధీ అని చెప్పుకునేందుకు, మహా అయితే ఓ నాలుగేళ్లలో ఓ పంటగా ఉండొచ్చు. అన్నదాతగా మనం కీర్తించే రైతుల (Farmers) అవేధనాకర పరిస్థితికి తార్కాణంగా రాయలసీమ రైతుల(Farmers) పరిస్థితి ఇలా మారిపోతోంది.
ప్రస్తుతం కురుస్తున్న తుపాన్ వర్షాలతో
రాయలసీమ కూడలి ప్రాంతమైన మైదుకూరు ప్రాంత రైతులు(Farmers) ఆవేదన, ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ఉల్లి
సాగు చేసిన రైతుల్లో(Farmers) ఈ ఆవేదన
అధికంగా కనిపిస్తోంది. ప్రతియేటా ఖజీఫ్ సీజన్ లో మైదుకూరు ఉద్యాన శాఖ పరిది ఐన
మైదుకూరు, చాపాడు, దువ్వూరు, ఖాజీపేట మండల ప్రాంతాల్లో కలిపి దాదాపు 4 వేల ఎకరాల
మేర ఉల్లి సాగు చేస్తారు.
ప్రస్తుతం ఉల్లి పంటలో పెద్ద బళ్ళారి రకం దిగుబడి చేతుకోచ్చే పరిస్థితిలో వుంది. ఈ సమయంలో తుఫాన్ దాటికి రైతుల్లో ఆందోళన, ఆవేదన పెరుగుతోంది. ఎడతెరిపి లేని జడివానతో ఉల్లి పోలాలు దెబ్బతినే పరిస్థితి ఏర్పడుతోంది.
పొలాల్లో ఎడతెరిపి లేని వర్షం కారణంగా పెరుగుతున్న నీటి నిల్వలు, మారిన వాతావరణ ప్రభావం ఫలితంగా ఉల్లి పంట దిగుబడి నష్టపోయే ముప్పు ఏర్పడింది. గురువారం నాటికీ కురిసిన వర్షానికి నలబై శాతం మేర పంట నష్టపోయే పరిస్థితి వచ్చిందని, ఇదే తీరున వర్ష పరిస్థితి ఇంకొన్ని రోజులు కొనసాగితే, పంట పూర్తిగా నష్టపోయే ముప్పు ఉంటుందనే అవేధనను ఉల్లి సాగు రైతులు(Farmers) వ్యక్తం చేస్తున్నారు.
ఉల్లితో పాటు టమోటా పంట సాగు చేసిన రైతుల్లోనూ, అవేధన కనిపిస్తోంది.
పొలంలో నీటి చేరికతో టమోటా మొక్కలు చనిపోయే పరిస్థితి వచ్చిందని వారు
చెబుతున్నారు. పంట చేతికొచ్చే సమయాల్లో
ఇలా అకాల తుఫాన్లతో నష్టపోతున్న రైతులను(Farmers) ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.




కామెంట్‌లు